పేదలకు ఎంతత్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామని చెప్పారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీచేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.