సెంటు స్థలంలో సమాధులు కట్టుకోమంటున్న చంద్రబాబును రాజకీయల నుంచే కాదు.. దేశం నుంచే బహిష్కరించాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చరిత్రలో చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యయం అయితే.. ఆ పాలనలో పేదలకు ఇల్లు అనేది ఒక కలగానే ఉండిపోయిందని పేర్కొన్నారు. ఆ కలను సాకారం చేయడానికి సీఎం వైయస్‌జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. కోపం, అసూయ, ద్వేషంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.