పేదవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే భూమిని సమాధులతో పోల్చడానికి చంద్రబాబుకు నోరెలా వచ్చింది..? అహంకారం, పెత్తందారీ మదం నెత్తికెక్కిందా..? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. పేదల పట్ల మదమెక్కి మాట్లాడుతున్న చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడు అని మండిపడ్డారు. పేదలు కట్టుకునే ఇళ్లు సమాధులైతే.. పేదల కాలనీలు స్మశానాలైతే చంద్రబాబు ఈ రాష్ట్రంలో పేదలు నివసించే ప్రాంతాల్లోకి వెళ్లి ఇదే విధంగా నోరుమెదపగలడా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు.