ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలను ఎక్కించుకునేందుకు బస్సు డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. డ్రైవర్, సిబ్బందిని చర్యలు తీసుకుంటామని చెప్పారు.