వివేకా హత్యకేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. అందుకు గల కారణాలతో సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం బాలేదని, నేడు విచారణకు హాజరుకాలేనని తెలిపారు. తన తల్లికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్పించారని లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను పులివెందుల వెళ్తున్నానని, విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు.