కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఘోర ప్రమాదానికి గురవుతారు. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ బైక్ రైడర్ రిస్క్ చేయబోయి ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డుపై భారీ బండరాయి ఉండడంతో పక్కన ఉన్న కాస్త సందులోంచి బైక్ డ్రైవ్ చేయడానికి యత్నించాడు. దీంతో అదుపుతప్పి బైక్ తో సహా లోయలో పడిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు.