ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలు పట్టించుకునే వారే లేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 19, 2023, 12:49 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడి అంతా అవినీతిమయంగా మారిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ముగింపులో భాగంగా అయన మాట్లాడుతూ...... కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులులేవని, తాగు, సాగు నీరు అందక ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు సమస్యలను పట్టించుకోవడంలేదని, కాల్వలు పూడికతో నిండిపోయాయని, విద్యుత్‌ కోతలతో ప్రజలు అల్లాడుతున్నా రున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ ఆస్తులను పెంచుకోవడంపై తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించట్లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే ఈ ప్రభు త్వానికి చరమ గీతం పాడతారన్నారు. సమావేశంలో నాయ కులు కంఠంశెట్టిశ్రీనివాసరావు, ముత్యాల బాబ్జీ, యల్లమిల్లి జగన్మోహన్‌, బూసి భాస్కరరావు, మిద్దే ఆదినారాయణ, బండారు వీరబాబు, పల్లి ఏసు, దేవపాటి వెంకటేశ్వరరావు, విళ్ల మారుతీప్రసాద్‌, ఎలిశెట్టి చిన్నా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com