పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉదయం నీటి సొంపులో మృతి చెందిన బాధిత కుటుంబాలను రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పరిహారం కింద ఐదు లక్షలు, వైఎస్సార్ భీమా కింద మరో ఐదు లక్షలు అందిస్తామని మంత్రి తెలియజేశారు.