యూపీలోని శివ నాడార్ యూనివర్శిటీలో తాజాగా దారుణం జరిగింది. అనూజ్ కుమార్ (22), స్నేహ బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్నారు. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. అయితే స్నేహ మరో వ్యక్తితో డేటింగ్ చేస్తూ తనను మోసం చేసిందని అనూజ్ భావించాడు. ఈ క్రమంలో క్యాంపస్‌లోనే తన ప్రియురాలిని కౌగలించుకుని, తర్వాత తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.