వానకాలం, యాసంగి సీజన్‌లలో పంటలు కోసిన తర్వాత తప్పనిసరిగా పొలాన్నిదున్నాలి. వేసవిలో పొలాన్ని దున్నడంతో పంటల దిగుబడికి ఎంతో ఉపయోగపడుతుంది. పంటలకు నాశనం చేసే పురుగులు నాశనమవుతాయి. దుక్కులు దున్నేముందు పొలంలో గొర్రెలు, మేకలు, పశువుల మందలు తోలడం చేయించాలి. పొలంలో వాటి విసర్జన పదార్థాలు భూమిలో ఇంకి భూసార వృద్ధికి దోహదపడతాయి. ఫలితంగా పంటల అధిక దిగుబడికి దోహదపడుతుంది.