స్థానిక జీవీఎంసీ విశాఖపట్నం నాలుగోవార్డు పరిధిలోగల కాపులుప్పాడ గ్రామంలో శుక్రవారం జీవీఎంసీ కమిషనర్ పర్యటించి ప్రజానీకం సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాల రమాణా రెడ్డి, జనసేన నాయకులు వేముల ఈశ్వర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు దుంప సత్యం,గుడ్ల కొండ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.