ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చిట్ట చివరి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడమే సీఎం లక్ష్యం అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, వరదల సమయంలో వాలంటీర్ల సేవలు అభినందనీయమని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.