ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4742 మంది వాలంటీర్లకు సేవా పురస్కారాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 19, 2023, 02:48 PM

పార్వతీపురం, సూర్య బ్యూరో ప్రతినిధి : జిల్లాలో 4742 మంది వాలంటీర్లు సేవా పురస్కారాలు అందుకున్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు అలజంగి జోగారావు, విశ్వసరాయి కళావతి పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. జిల్లాలో 312 గ్రామ, 38 వార్డు సచివాలయాలు వెరసి 350 ఉండగా 4947 మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో, 676 మంది పట్టణ స్థాయిలో వెరసి 5623 పోస్టులు ఉండగా 4851 మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో, 643 మంది పట్టణ స్థాయిలో వెరసి 5494 మంది పనిచేస్తున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 4030 మందికి సేవా మిత్ర, 75 మందికి సేవా రత్న, 17 మందికి సేవా వజ్ర పురస్కారాలు లభించాయి. పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 603 మందికి సేవా మిత్ర, 15 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర పురస్కారాలు లభించాయి. 4633 మందికి సేవా మిత్ర, 90 మందికి సేవా రత్న, 19 మందికి సేవా వజ్ర వెరసి 4,742 మందికి పురస్కారాలు లభించాయి.


కురుపాం నియోజక వర్గంలో కొమరాడ మండలంలో 220 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 227 మందికి పురస్కారాలు లభించాయి. గుమ్మలక్ష్మిపురం మండలంలో 291 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒకరికి సేవా వజ్ర వెరసి 297 మందికి పురస్కారాలు లభించాయి. కురుపాం మండలంలో 236 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 241 మందికి పురస్కారాలు లభించాయి. జియ్యమ్మ వలస మండలంలో 251 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 258 మందికి పురస్కారాలు లభించాయి. గరుగుబిల్లి మండలంలో 225 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 230 మందికి పురస్కారాలు లభించాయి.


పాలకొండ నియోజక వర్గంలో వీరఘట్టం మండలంలో 373 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒరికి సేవా వజ్ర వెరసి 379 మందికి పురస్కారాలు లభించాయి. సీతంపేట మండలంలో 317 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒరికి సేవా వజ్ర వెరసి 323 మందికి పురస్కారాలు లభించాయి. భామిని మండలంలో 222 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 227 మందికి పురస్కారాలు లభించాయి. పాలకొండ మండలంలో 244 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 251 మందికి పురస్కారాలు లభించాయి. పాలకొండ పట్టణంలో 138 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒరికి సేవా వజ్ర వెరసి 144 మందికి పురస్కారాలు లభించాయి.


పార్వతీపురం నియోజక వర్గంలో పార్వతీపురం మండలంలో 318 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 323 మందికి పురస్కారాలు లభించాయి. సీతానగరం మండలంలో 292 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 299 మందికి పురస్కారాలు లభించాయి. బలిజిపేట మండలంలో 353 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 360 మందికి పురస్కారాలు లభించాయి. పార్వతీపురం పట్టణంలో 238 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఒరికి సేవా వజ్ర వెరసి 244 మందికి పురస్కారాలు లభించాయి.


సాలూరు నియోజక వర్గంలో మక్కువ మండలంలో 287 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 294 మందికి పురస్కారాలు లభించాయి. సాలూరు మండలంలో 186 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న, ఇద్దరికి సేవా వజ్ర వెరసి 193 మందికి పురస్కారాలు లభించాయి. పాచిపెంట మండలంలో 215 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 220 మందికి పురస్కారాలు లభించాయి.  సాలూరు పట్టణంలో 227 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవా రత్న వెరసి 232 మందికి పురస్కారాలు లభించాయి.


ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించుటకు ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని అన్నారు. పరిపాలన పకడ్బందీగా క్షేత్ర స్థాయిలో చేరుటకు చక్కని వ్యవస్థ అని చెప్పారు. అవినీతి లేని, పారదర్శకంగా పథకాలు చేర్చుతున్నారని ఆయన కొనియాడారు. కరోనాలో అధ్భుత సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం పని చేస్తున్నారని ఆయన వివరించారు. అర్హులని గుర్తిస్తూ పథకాలు అందేవిధంగా మీరు తోడ్పాటును అందిస్తున్నారని, సేవాభావానికి, మానవత్వానికి మారు పేరుగా నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెల్లవారక ముందే పింఛను ఇంటికి వెళ్ళి అందిస్తూ సేవా నిరతిని చాటుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాలంటీర్లు పట్ల ప్రేమ మమకారం ఉన్నాయన్నారు. సేవ చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతకు మంచి అవకాశం కల్పించిందని ఆమె పేర్కొన్నారు. మరిన్ని సేవలు అందించాలని ఆమె కోరారు. శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించుటకు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. 


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవస్థ కోసం హార్వర్డ్ యూనివర్శిటీలో కూడా వివరించడం జరిగిందన్నారు. వాలంటీర్ లు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం జరిగే స్థాయికి ఎదిగింది. ప్రజలకు, ప్రభుత్వానికి మంచి వారధిగా పనిచేస్తూ ప్రభుత్వానికి కళ్ళు, చెవులుగా పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు క్షణాల్లో చేరుటకు, సమాచారం చేరవేయడానికి వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని అన్నారు. వాలంటీర్లు సేవా పురస్కారాలకు రూ.5 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ బి. గౌరీశ్వరి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సచివాలయాల నోడల్ అధికారి కె. రామచంద్ర రావు, మునిసిపల్ కమీషనర్ జె. రామ అప్పల నాయుడు, పార్వతీపురం ఎం.పి.పి మజ్జి శోభా రాణి, జెడ్పీటీసీ రేవతమ్మ, బలిజిపేట, సీతానగరం మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com