ఢిల్లీలోని రోహిణి కోర్టులో మే 18న విస్మయకర ఘటన జరిగింది. ఇద్దరు న్యాయవాదులు కోర్టులోనే ఘర్షణ పడ్డారు. మహిళా న్యాయవాది నేహా గుప్తా, మరో న్యాయవాది విష్ణుకుమార్ శర్మ ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత విష్ణుపై పోలీసులకు నేహా గుప్తా ఫిర్యాదు చేసింది. తనను వేధించాడని, శారీరకంగా దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ముందుగా తనపై విష్ణు తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది.