ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి నియమితులయ్యారు. వెంకట శేషసాయి ఇప్పటి వరకు ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. తాజాగా ఆయనకు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ప్రశాంత్ కుమార్ మిశ్రా హైకోర్టు సీజేగా ఉన్నారు. తాజాగా మిశ్రాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.