పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 38 కి.మీ దిగువన ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) వెల్లడించింది.భారీ భూకంపం నేపథ్యంలో పలు పసిఫిక్ ద్వీప దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఫిజీ, వెనిజులా, న్యూ కలెడోనియా దేశాలపై సునామీ ప్రభావం ఉంటుందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ మూడు దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.