రూ.2 వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది. ఎక్కువ మంది rbi.org.in వెబ్సైట్లో సెర్చ్ చేయడంతో ఇది జరిగినట్లు తెలుస్తోంది. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు సమయంలోనూ అదే జరిగింది. రద్దయిన రూ.2 వేల నోట్లను సెప్టెంబర్ 30లోపు సమీపంలోని బ్యాంకులు, ఆర్బీఐ ప్రాంతీయ కేంద్రాల ద్వారా మార్చుకోవచ్చు.