ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్లపై ప్రతిపక్షాలకు కడుపు మంట... సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 19, 2023, 10:03 PM

ఏపీలోని వాలంటరీ వ్యవస్థపై ప్రతిపక్షాలకు కడుపుమంట ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద డజను జెలుసిల్ మాత్రలు వేసినా తగ్గనంత కడుపు మంట ప్రతిపక్షాలకు ఉందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వాలంటీర్ వ్యవస్థ మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారని, అల్లరి మూకలని, మూటలు మూసే ఉద్యోగమని, అధికారం వస్తే వాలంటీర్లను రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.


వాలంటీర్ల ఏర్పాటుపై గతంలో కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని వివరించారు. వాలంటీర్ల సేవాభావానికి ప్రజలు మెచ్చుకోవడం మొదలవడంతో చంద్రబాబు మాట మార్చి అధికారంలోకి వస్తే కొత్త జన్మభూమి కమిటీలతో వాలంటీర్ సైన్యాన్ని తీసుకోస్తామన్నాడని గుర్తు చేశారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాజకీయాలు జరుగుతున్నా, వాలంటీర్లు తన ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పారు. 


‘‘సూర్యోదయానికి ముందే ఫించన్లు ఇస్తుంటే నిందలు వేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇస్తుంటే.. తలుపులు తట్టడానికి వీరెవరంటూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. వాలంటీర్లను జగనన్న సైన్యం అంటూ చంద్రబాబు అంటున్నారు’’ అని జగన్ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com