ఫిరంగిపురం మండలం అమీనాబాద్ తండా కు చెందిన దేవసోత్ పూర్ణేశ్వర్ నాయక్, వయస్సు 17 సంవత్సరాలు అనే యువకుడు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న తేదీన రాత్రి 10 గంటలకు అమీనాబాద్ లోని తన నివాసంలో తల్లిదండ్రులు డాబా ఇంటి పైకి నిద్రించుటకు వెళ్లి ఉదయం 5. 30 గంటలకు క్రిందికి వచ్చి ఇంట్లో చూడగా వారి కుమారుడు కనిపించకుండా వెళ్లిపోయాడు. ఎంత వెతికిన ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.