చిత్తూరు నగరంలోని గిరింపేట వీధిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా స్వామివారి పుష్ప పల్లకి సేవను నిర్వహించారు. ఆలయ పాలకమండలి సభ్యులు మాట్లాడుతూ. ప్రతి ఏడాది వసంత రుతువు వైశాఖమాస అమావాస్యనాడు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పుష్ప పల్లకి సేవను ప్రతిఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఈ ఏడాది సైతం స్వామివారి పుష్పల్లకి సేవ ప్రత్యేక పుష్పాలతో పల్లకిని అలంకరించి నగర మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించామన్నారు. శుక్రవారం రాత్రి దాదాపు 11 గంటల 30 నిమిషాల వరకు కార్యక్రమం జరిగిందని ఆలయ పాలకమండలి సభ్యులు తెలిపారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.