ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమానికి టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలోని ఎస్. కోటలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి మత్స్యరాస. మణికుమారి తమ కుమార్తెతో చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాయంగా పలకరించి కొద్దిసేపు ముచ్చటించారు. మణికుమారి చంద్రబాబుతో మాట్లాడుతూ. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని టీడీపీకి గత పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ఆమె స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా మన్యం పంచాయతీ గ్రామ స్థాయిల్లో టీడీపీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చంద్రబాబుతో ఆమె చెప్పారు.