వంద మంది బాబులు వచ్చినా పేదల ఇళ్లు ఆపలేరని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. గృహ ప్రవేశాలు జరిపి తీరుతాం... అది తప్పదని స్పష్టం చేశారు. పేదలు, పెత్తందార్ల పోరాటంలో నిరుపేదలదే గెలుపు అని మంత్రి పేర్కొన్నారు. సత్తెనపల్లిలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.