నా నియోజకవర్గంలోని విస్సన్నపేట భూములపై చంద్రబాబు నిన్న నాకో సవాల్ చేశాడు. దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. నీ మాదిరిగా, మేము ఎక్కడా భూములు కైంకర్యం చేయలేదు. నీ కొడుకు తోడల్లుడు గీతం వర్సిటీ పేరుతో భూమి కాజేశాడు. విస్సన్నపేటలో నా పేరుపై అర సెంట్ భూమి ఉన్నా నిరూపించు రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబుకు మంత్రి అమర్నాథ్ సవాల్ చేశారు. శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడారు.