లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 15న వినుకొండలోని ఇందిరానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శావల్యాపురం వరకు పాదయాత్ర చేసిన టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులుతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించి, రాకపోకలకు అంతరాయం కలిగించారని విఠంరాజుపల్లెకు చెందిన పెద్దిరెడ్డి రామిరెడ్డి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేశారు.