అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది. పాఠశాలలో టీచర్లు టీ షర్ట్స్, జీన్స్, లెగ్గింగ్స్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని, వారి వస్త్రధారణ కూడా హుందాగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందువల్ల విధులు నిర్వర్తించే సమయంలో మంచి డ్రెస్సింగ్ ఉండాలని తెలిపింది.