జర్మనీ దేశంలో భారీగా ఐటీ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ సంస్థ జనరల్ మేనేజర్ నాగభారతి ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడి కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, డేటా ఇంజినీర్లు తదితర ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 78935 66493, 98496 39539 నంబర్లను సంప్రదించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa