ప్రత్తిపాడు మండలంలో అప్రకటిత కరెంటు కోతలపై నిరసన తెలుపుతూ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరాంప్రసాద్ మాట్లాడుతూ గడిచిన 10 రోజుల నుంచి మండలంలో కరెంటు కోతల వలన వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ వారు అధికారికంగా ఏమైనా కోతలు ఉంటే ప్రజలకు ముందుగా ఏ టైంలో కరెంటు కోత విధించబడుతుందో తెలియపరిస్తే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవటకు వీలుంటుందని, అధికారికంగా కరెంటు కోతలు లేనప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను తెరతీస్తే ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడి ఉద్యమాలు చేయటానికి కూడా వెనుకాడదని హెచ్చరించారు.