జగనన్న కాలనీలలో నివేశన స్థలాలు పొందిన లబ్ధిదారులు త్వరితగతిన గృహాలు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని రేపల్లె ఆర్డీవో పార్ధసారధి అన్నారు. రేపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈలతో గృహనిర్మాణాలపై రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదవారి సొంతింటి కలసాకారం సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించి స్థలాలను మంజూరు చేసిందన్నారు.