ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2023, 06:58 PM

నేడు సమాజం అంతర్జాలంతో సాంకేతిక నైపుణ్యాలతో ముందుకు వెళుతున్న ఇంకా వరకట్నం చావులు కొనసాగుతున్నాయన్నదానికి నిదర్శనంగా పిరువాడ గ్రామంలో జరిగిన వివాహిత ఆత్మహత్య ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. వివరాలకు వెళితే పోలాకి మండలం పిరువాడ గ్రామానికి చెందిన ఎన్ని రమేష్ జలుమూరు మండలం సంత నారాయణ వలస గ్రామానికి చెందిన ఢిల్లీశ్వరితో గత 14 నెలల క్రిందట వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చినప్పటికీ భర్త రమేష్ వేధింపులు రోజురోజుకు పెరిగిపోయాయి. ఇటీవలే ఐదు నెలల క్రిందట ఢిల్లీశ్వరి ఒక పాపకు జన్మను ఇచ్చింద. అయితే భర్త వేధింపులు తాళలేక ఆదివారం ఉదయం తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు సమాచారం అందుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే క్లూస్ టీమ్ను కూడా రప్పించామని నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రాము తెలిపారు. మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com