ఏపీ సీఎం జగన్ నేడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. రూ. 5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఈ పోర్టు నిర్మాణంతో వాణిజ్య కార్యక్రమాలు విస్తరిస్తాయని, రానున్న రోజుల్లో కృష్ణా జిల్లా ముఖచిత్రం మారుతుందని స్థానికులు చెబుతున్నారు.