వైఎస్ వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారులు నేడు ఉదయం కర్నూలు చేరుకొని స్థానిక ఎస్పీతో భేటీ అయ్యారు. అనంతరం అవినాష్ తల్లి చికిత్స తీసుకుంటున్న విశ్వభారతి ఆసుపత్రి ముందు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. కాగా, ఇప్పటికే రెండు సార్లు విచారణకు గైర్హాజరైన అవినాష్, నేడు కూడా విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు.