ఐరాల మండలం , నాంపల్లె రెవెన్యూ గ్రామంలో వెలసిన ద్రౌపది అమ్మవారి ఆలయంలో సోమవారం నుంచి మహా భారత యజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇందులో భాగంగా ఆదివారం ఆలయం వద్ద ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.సోమవారం నుంచి ఆలయ ప్రాంగణంలో జూన్ 7వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హరికథను చెప్పనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 27వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు రాత్రి ఆటను నిర్వహించనున్నట్లు వారు వివరించారు. ప్రతి ఒక్కరూ మహా భారత యజ్ఞ. కార్యక్రమానికి హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.