ప్రేమికులు కోర్టు ఆవరణలో పెళ్లి చేసుకున్న ఘటన బీహార్ సీతామఢీ జిల్లాలో జరిగింది. బర్గానియాలో రాజా, అర్చన ప్రేమించుకొని ఇంట్లో నుండి పారిపోయారు. దీంతో తన కూతురిని కిడ్నాప్ చేశాడంటూ అర్చన తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాజాను జైలుకు పంపారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరగ్గా, ఇరు కుటుంబాలు చర్చించుకొని పెళ్లికి అంగీకరించాయి. దీంతో కోర్టు ఆవరణలో వారి పెళ్లి జరిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa