విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కంఠం వారి వీధిలో ఆదివారం అర్థరాత్రి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అగ్నికీలలు భారీగా ఎగసిపడుతుండడంతో భయబ్రాంతులకు లోనయ్యారు. గతంలో ఇలాగే 4వాహనానలు కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని స్థానికులు అంటున్నారు. ఘటనలో ఇప్పటి వరుకు నిందితులు జాడ తెలియరాలేదని స్థానికులు వాపోతున్నారు.