నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ని సోమవారం పోలీసులు గృహనిర్బంధం చేశారు. పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా విచ్చేసిన మాలేపాటి ని పోలీసులు చుట్టుముట్టారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటం చేయడం తప్పా అంటూ ఈ సందర్భంగా సుబ్బానాయుడు పోలీసులను ప్రశ్నించారు. కావలి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం తాను ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, ఎటువంటి పోరాటమైన చేస్తానని ఈ సందర్భంగా వారికి వెల్లడించారు.