కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఓ మహిళ విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం మదనపల్లిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు. నీరుగట్టువారిపల్లెకు చెందిన రమణమ్మ(45) కూలి పనులు చేసుకుంటూ జీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఈమె ఆదివారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు వైద్య చికిత్సలు అందించారు.