రాష్ట్రంలో మీడియాపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వెంకటరమణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి నరేంద్ర, సీనియర్ జర్నలిస్టు ఆర్ఎం ఉమామహేశ్వరరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్, యూనియన్ కోశాధికారి చంద్రబాబు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శులు తారక, పద్మనాభం, కార్యవర్గ సభ్యులు రాజు, రాధాకృష్ణ లతో పాటు జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.