ఇంటి స్థలం విషయమై ఘర్షణ పడిన ఘటన మండలంలోని నేలపల్లె గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు, నేలపల్లెకు చెందిన మూర్తిపై మంజునాథ, రంజిత్, హేమనాథు ఇంటిస్థలం కోసం తగాదా పడ్డారు. అడ్డువచ్చిన మూర్తి చిన్నాన్న వెంకటస్వామిని. మంజునాథ కుటుంబీకులు గాయపరిచారు. మూర్తి పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.