పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయ జీర్ణోదరణ కార్యక్రమాలు సోమవారం వైభవంగా నిర్వహిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలయ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, నాయకులు దామోదర్ రాజు, మిద్దంటి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.