నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గా బాలస్వామి యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆయన మార్కెట్ యార్డు కార్యాలయం లో ఈమేరకు బాధ్యతల స్వీకరణ పత్రంపై సంతకం చేశారు. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావుడి లేకుండా గోప్యంగా పదవీ బాధ్యతలు స్వీకరించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్గపోరు కారణంగానే గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. నూతన మార్కెట్ యార్డు చైర్మన్ కు పలువురు పుర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.