రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మాచర్ల పురపాలక సంఘ పరిధిలో 22 వార్డులో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వార్డులోని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.