మాచవరం మండలం వేమవరం గ్రామంలో అప్పుల బాధలు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. వేమవరం గ్రామానికి చెందిన కంబాల శ్రీనివాసరావు తనకున్న నాలుగు ఎకరాల పొలం కాక మరో నాలుగు ఎకరాలు పొలం కొవులుకు తీసుకొని ఈ సంవత్సరం వ్యవసాయం కొనసాగించాడు. అయితే సకాలంలో పంటల పండగ తెచ్చిన అప్పులు తీర్చలేక తన సొంత పొలంలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం పనులకు వెళ్లిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామంలో విషాదఛాయ అలుముకున్నాయి. దీనిపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. భార్య కంబాల శివమ్మ ఫిర్యాదు మేరకు మాచవరం ఎస్ఐ కోటయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.