గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఎస్సై రవితేజ అందుబాటులోకి రాకపోవడం, విధులకు గైర్హాజరవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈక్రమంలో ఆయనను ఎస్పీ సస్పెండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa