తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సోమవారం పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే పోలీసు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రూ. 554 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దీంతో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండి. మస్తాన్ఖాన్, ట్రెజరర్ ఎం. సోమశేఖర రెడ్డి, ఉప్పు శంకర్, కె. రామునాయుడు, బి. స్వర్ణలత, పి. శేషయ్య, సీహెచ్. హజరత్తయ్య, డి. సురేష్, ఆర్. నాగేశ్వరరావు, జి. అక్కిరాజు, పి. ఓంకార్, కె. నాగిని, టి. మాణిక్యాలరావు తదితరులు ఉన్నారు.