రాజధాని ప్రాతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డుపడుతున్న పేదల ద్రోహులను అరెస్ట్ చేయాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం 968వ రోజు తాళ్లాయపాలెం వద్ద బహుజన నాయకులు మూడు రాజధానుల కోసం రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా జానెడు జాగా ఇవ్వని చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే 3 సెంట్లు స్థలం ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు పేదలకు ఇచ్చే స్థలాలు అడ్డుకోవడం ఆయన కుల అహంకారం అని అన్నారు.