పెంచిన విద్యుత్ చార్జీలు, కోతలకు నిరసనగా సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నేత మన్నెం శివనాగ మల్లేశ్వరరావు మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు