గాజువాక శ్రీనగర్ డిజైర్ సొసైటీ సమ్మర్ క్యాంప్ ఆటలపోటీలు సోమవారంతో ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా ఎంపి రాజ్యసభ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపి జీవీఎల్ మాట్లాడుతూ హెచ్. ఐవి సోకిన పాజిటివ్ పిల్లలకు వసతితో పాటు చదువు, పౌష్టికాహారం అందించి వారి జీవితకాలం పెరిగే విదంగా కృషి చేస్తున్న సంస్థ ప్రతినిధి జి. రవిబాబుని అభినందించారు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం దేశ ప్రదాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. గౌరవ అతిదిగా పాల్గొన్న గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ అద్దె భవనంలో వుంటున్న డిజైర్ సొసైటీకి లీజుకి స్థలం ఇప్పించమని ఎంపి జీవీఎల్ ని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన తక్కువ దరకు లీజుకి ఇచ్చే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వాకులు లక్ష్మణ్ , రజని నాయకులు పరశురాం, బలిరెడ్డి సత్యనారాయణ, గూటూరు శంకరరావు , రోహిణి, నాగేశ్వరరావు, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.