తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్ద తిప్పసముద్రం మండలంలో కరెంట్ షాక్ కొట్టి మృతి చెందిన సర్పంచి బాబురెడ్డి మృత దేహాన్ని మంగళవారం మదనపల్లి డీఎస్పీ కేశప్ప పరిశీలించారు. కుర్రావాండ్లపల్లికి చెందిన గ్రామ సర్పంచి కొండా బాబురెడ్డి(50) మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలోని బోరు మోటర్ ఆన్ చేయడానికి వెల్లి షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. సమాచారం తెలియగానే డీఎస్పీ వెళ్లి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.