గత కొన్ని నెలలుగా మాచర్ల రైలులో ప్రయాణికులు పడుతున్న బాధలు దారుణంగా ఉన్నాయని మాచర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రామచంద్రారెడ్డి మంగళవారం అన్నారు. ప్రయాణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పసిపిల్లల తల్లులు, పిల్లలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అంతకుముందు ఉన్న రైలును మార్చి డెమో ట్రైన్ పేరుతో కొత్త రైలు వేశారన్నారు. కొత్త రైలులో ప్రయాణికులకు సౌకర్యాలు లేవని అయన తెలిపారు.