వైసీపీ నాయకులపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధుల్లో చాలామంది నేరచరితులేనని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మొత్తం 408 క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. జగన్‌పైనే 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయని, మొత్తం 31 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ న్యాయ కార్యకలాపాల ఖర్చులు 70 శాతం పెరిగాయని పేర్కొన్నారు.